Benguluru : కాంగ్రెస్ ప్రభుత్వానికి బెంగుళూరు వాసుల హెచ్చరిక
బెంగుళూరు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
బెంగుళూరు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంటలు పడ్డాయి. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో ప్రజలు ప్రయాణం చేయడం నరకంగా మారింది. అదే సమయంలో విధులకు వెళ్లేందుకు కూడా ఆలస్యమవుతుందని బెంగుళూరు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరు ప్రజలు హెచ్చరికలు జారీ చేశారు. రహదారులు సరిగా లేకుంటే పన్ను చెల్లింమని కాంగ్రెస్ సర్కారుకు బెంగుళూరు ప్రజలు హెచ్చరిక జారీ చేశారు.
రోడ్లు బాగా లేకపోవడంతో...
ఇవేం రోడ్లు, ఇవేం డ్రైనేజీల నిర్మాణం? ఒక ప్రణాళిక, పద్ధతి లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణంలో శాస్త్రీయ విధానాలు పాటించరా? అంటూ బెంగుళూరు తూర్పు ప్రాంత వాసులు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే ముంచుతున్న వరదలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు సంబంధిత పనులు, ప్రణాళిక లేని ప్రాజెక్టులపై వారు మండిపడ్డారు. తమకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకు ఆస్తి పన్ను వసూళ్లను నిలిపివేయాలని ముఖ్యమంత్రిని ప్రజలు డిమాండ్ చేశారు