ఏపీ భవన్‍ను బాంబు బెదిరింపు
ఢిల్లీలో ఏపీ భవన్‍ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో అధికారుల అప్రమత్తమయ్యారు
ఢిల్లీలో ఏపీ భవన్‍ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో అధికారుల అప్రమత్తమయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఏపీ భవన్ అధికారులు, పోలీసులు వెంటనే తనిఖీలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ లో పోలీసులతో పాటు డాగ్ స్వ్కాడ్ తనిఖీలు జరిపాయి. అయితే చివరకు ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చారు.
ఫేక్ బెదిరింపు మెయిల్‍గా...
ఫేక్ బెదిరింపు మెయిల్‍గా తేల్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ భవన్ కు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారన్న దానిపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా కాసేపు మాత్రం ఏపీ భవన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.