మరోసారి ఉద్యోగులపై వేటు వేసిన అమెజాన్.. ఈసారి 9 వేలమందిపై

ప్రస్తుతం అమెజాన్ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 27 వేల మంది ఉద్యోగులకు

Update: 2023-03-21 08:16 GMT

amazon layoffs

ప్రముఖ ఐటీ, సాఫ్ట్ వేర్, ఈ కామర్స్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపుల పర్వాలు కొనసాగుతున్నాయి. నాలుగురోజుల క్రితం మెటా సంస్థ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్ కూడా మరోసారి ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతోంది. సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

క్లౌడ్, ప్రకటనల విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పైనే వేటు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక అనిశ్చితి, సంస్థ పనితీరు మెరుగుపరుచుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమెజాన్ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 27 వేల మంది ఉద్యోగులకు సంస్థ ఉద్వాసన పలికింది. మొత్తం ఉద్యోగుల్లో 9 శాతం మంది ఉద్యోగులపై లే ఆఫ్ ల ప్రభావం పడింది. అయితే.. క్లౌడ్, ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత ఉంటుందన్న ధీమా ఉండేది. ఇప్పుడు వారిపైనా వేటు వేయకతప్పడం లేదని అమెజాన్ పేర్కొనడంతో.. ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా ఉద్యోగుల తొలగింపు ప్రకటనతో.. అమెజాన్ స్టాక్ విలువ 2 శాతం పడిపోయింది.



Tags:    

Similar News