Delhi Assembly Elecions Counting : ఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్ నేడు.. విజేత ఎవరో?

ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది.

Update: 2025-02-08 01:52 GMT

ఢిల్లీలో నేడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ అధికారులు చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతం మంది తమ ఓట్లను వినియోగించుకున్నారు. ఈ నెల 5వ తేదీనపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఉచిత పథకాల హామీలను ప్రజలు ముందు ఉంచాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అన్ని సర్వేలు కమలానిదే గెలుపు అని చెబుతున్నాయి

70 నియోజకవర్గాలకు...
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నేడు కౌంటింగ్ జరుగుతుంది. ఇందులో యాభై ఎనిమిది జనరల్ సీట్లు కాగా, పన్నెండు ఎస్సీ రిజర్వ్ సీట్లున్నాయి. పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికకరంగా మారింది. 83 లక్షల మంది పురుష ఓటర్లుండగా, 71 లక్షల మంది మహిళ ఓటర్లున్నారు. యువ ఓటర్లు 25 లక్షలుగా ఉంంది. తొలిసారి ఓటు వేసే వారు రెండు లక్షల మంది వరకూ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తారు.
కౌంటింగ్ కోసం...
ఢిల్లీకౌంటింగ్ కోసం మొత్తం పందొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తం పదివేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. నాలుగోసారి అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అయితే 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటామన్న ధీమాలో కమలనాధులున్నారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు లేకపోయినా ఎవరి ఓట్లు చీలుస్తుందన్న టెన్షన్ పార్టీ నేతల్లో నెలకొంది. ఉచిత హామీలు ఢిల్లీలో ఎంత వరకూ పనిచేస్తాయన్నది చూడాలి. ఈసారి అన్ని పార్టీలూ ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. మరి ఢిల్లీ దక్కేది ఎవరికోనన్నది మరి కాసేపట్లో తేలనుంది.


Tags:    

Similar News