ఇలాంటి రాజకీయనాయకులు ఇంకా ఉన్నారా?

రాజకీయనాయకులంటే ఇలా కూడా ఉంటారా అనేలా చేశారు ఓ మంత్రి.

Update: 2025-07-03 13:15 GMT

రాజకీయనాయకులంటే ఇలా కూడా ఉంటారా అనేలా చేశారు ఓ మంత్రి. తనకు కేటాయించిన వాహనానికి జరిమానా విధించాలని స్వయంగా పోలీసులను కోరారు. తనకు ఇచ్చిన వాహనం నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఈ విషయాన్ని ఆయన పోలీసు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి అసిమ్‌ అరుణ్‌ తన అధికారిక వాహనానికి జరిమానా విధించాలంటూ పోలీసు కమిషనర్‌ను స్వయంగా కోరారు. అరుణ్‌ ఇటీవల వారణాసిలో పర్యటించారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రభుత్వ ఇన్నోవా కారును ఆయనకు కేటాయించారు. ఆ కారుపై అనధికార బుగ్గ లైట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన మంత్రి ఆ కారులో ప్రయాణించడానికి నిరాకరించారు. కోర్టు నిషేధం ఉన్నప్పటికీ వాహనాలపై ఇలాంటి లైట్లు, స్టిక్కర్లు వాడుతున్నారని, ఇలాంటివాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.

Tags:    

Similar News