ఇలా వెళ్తే తక్కువ టోల్ ఫీజు అంటూ చూపించే యాప్

జాతీయ రహదారులపై వాహనాల్లో ప్రయాణించేవారు టోల్ ఫీజులు చెల్లిస్తూ ఉండాల్సిందే.

Update: 2025-06-28 12:30 GMT

జాతీయ రహదారులపై వాహనాల్లో ప్రయాణించేవారు టోల్ ఫీజులు చెల్లిస్తూ ఉండాల్సిందే. కొన్ని చోట్ల సాధారణ హైవేలే కాకుండా ఎక్స్ ప్రెస్ వే ఉంటాయి. అలాంటప్పుడు టోల్ ఛార్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే తక్కువ టోల్ ఫీజు ఎక్కువ ఉంటే ఆ రూట్ వెళ్లాలని కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం, అతి తక్కువ టోల్‌ ఫీజును వసూలు చేసే దారి ఏదో తెలుసుకునే సౌలభ్యం ‘రాజ్‌మార్గ్‌ యాత్రాయాప్‌’ ద్వారా లభించనుంది. జులై నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లడానికి మూడు మార్గాలు ఉన్నాయి. యమునా ఎక్స్‌ప్రెస్‌ మార్గం, గాజియాబాద్‌ - అలీగఢ్‌ - కాన్పుర్‌ - లక్నో రహదారి, మొరాదాబాద్‌ - బరేలీ - సీతాపుర్‌ - లక్నో రహదారి. వీటిలో అతి తక్కువ టోల్‌ ఫీజు వసూలుచేసే మార్గమేదో రాజ్‌మార్గ్‌ యాత్రా యాప్‌ ద్వారా వాహనదారులు తెలుసుకోవచ్చు. అలా పలు ప్రాంతాలకు సంబంధించిన టోల్ డేటా, రూట్ మ్యాప్ లు ఈ యాప్ లో ఉంటాయి.

Tags:    

Similar News