Telangana : బాత్ రూంలో ఇరవై లక్షలు.. మరో ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల విద్యుత్తు శాఖ ఏడీఈ రాజేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ సోదాల్లో రాజేశ్ ఇంట్లోని బాత్ రూంలో ఇరవై లక్షల రూపాయల నగదును ఏసీబీ అధికారులు కనుగొన్నారు. వాటిని సీజ్ చేశారు.
నిన్నటి నుంచి ఏడీఈ ఇంట్లో...
నిన్న విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లోనూ, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అనేక అక్రమఆస్తులు బయటపడ్డాయి. కోటి రూపాయల నగదు బినామీ ఇంట్లో పట్టుబడింది.దీంతో ఏసీబీ అధికారులు మరికొందరు బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.