తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు పవన్ వినతి
జమిలి ఎన్నికలపై స్టాలిన్ తననిర్ణయాన్ని పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు
జమిలి ఎన్నికలపై స్టాలిన్ తననిర్ణయాన్ని పునరాలోచించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. చెన్నై పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరచూ ఎన్నికల వల్ల కేంద్రంపై భారం పడుతోందన్న పవన్ తమిళనాడులో బీజేపీ కూటమి విజయం ఖాయం అని చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో అవసరమైతే ప్రచారం చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్డీయే కూటమి గెలుపు కోసం పని చేయడానికి సిద్ధమని ఆయన చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.
విజయ్ కు శుభాకాంక్షలు...
సినిమాలువేరు,రాజకీయాలు వేరు అన్న పవన్ కల్యాణ్ విజయ్‌కు శుభాకాంక్షలు కూడా తెలపడం విశేషం. ఈవీఎంలపై వైసీపీకి ఓ విధానం లేదన్న పవన్ కల్యాణ్ 2019లో వైసీపీ గెలిచింది కూడా ఈవీఎంలతోనేనని చెప్పారు. సనాతన ధర్మంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయన్న పవన్ కల్యాణ్ ఈ దేశమే సనాతన ధర్మ భూమి ఇది అని అన్నారు. మన దేశంలో రామాలయం లేని ఊరు లేదన్న పవన్ కల్యాణ్ ఈసారి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం ఖాయమని తెలిపారు.