బీహార్ వెళ్లిన చంద్రబాబు, లోకేష్
నేడు బీహార్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు బయలుదేరి వెళ్లారు
నేడు బీహార్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ఇరువురు నేతలకు ఆహ్వానం అందడంతో ఇద్దరూ ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు పాట్నాకు చంద్రబాబు, లోకేష్ బయలుదేరి వెళ్లారు. పాట్నాలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రమాణ స్వీకారానికి...
నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ హాజరు కానుండటంతో వీరు కూడా బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే అనేక మంది ఎన్డీఏ నేతలు పాట్నాకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి తిరిగిరానున్నారు.