ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని దారి మళ్లించి చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు

Update: 2025-08-11 04:08 GMT

తిరువనంతపురం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని దారి మళ్లించి చెన్నైలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తో పాటు కొందరు ఎంపీలు ప్రయాణిస్తున్నారు. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఎక్స్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. ప్రమాదం అంచుల వరకూ వెళ్లి వచ్చానని, భయానకమైన అనుభవం ఎదురైందని ఆయన పేర్కొన్నారు.

తిరువనంతపురం నుంచి...
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుంచి నిన్న రాత్రికి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 2455 లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే పైలెట్ అప్రమత్తమయి విమానాన్ని చెన్నైకు తరలించారు. అక్కడ ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కానీ అదే సమయంలో మరొక విమానం కూడా రన్ వేపైకి రావడంతో తాము ఆందోళనకు గురయ్యామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా మాత్రం విమానం సురక్షితంగానే ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని ప్రకటించింది.


Tags:    

Similar News