Ahmedabad Plane Crash: కూలిన విమానంలో మాజీ ముఖ్యమంత్రి

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది.మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు

Update: 2025-06-12 09:39 GMT

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అయితే ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. విజయ్ రూపానీ ఆ విమానంలో ప్రయాణిస్తున్నారన్న మీడియా కథనాలపై ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటన ఎటువంటి ది చేయలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేసి ప్రమాదం గురించి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన గుజరాత్ కు బయలుదేరివెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలను వెంటనే ప్రారంభించారు. 1.17 నిమిషాలకు టేకాఫ్ అయిందని చెబుతున్నారు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గా విమానం కూలిపోయింది. మొత్తం సిబ్బందితో కలిసి 256 మంది వరకూ ఉన్నారు.

జనావాసాల్లో పడటంతో...
సివిల్ ఆసుపత్రికి సమీపంలోనే విమానం కూలిపోయింది. విమానంలో పన్నెండు మంది సిబ్బంది కూడా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో సహాయక బృందాలు చేరుకుని చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తును్నారు. అంబులెన్స్ లు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. విమానం కూలిన సమాచారం తెలిసిన వెంటనే సంఘటన ప్రాంతానికి మూడు ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అహ్మాదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. జనావాసాల్లో పడటంతో ప్రాణ నష్టం ఏ మేరకు జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
టేకాఫ్ అయిన వెంటనే...
అయితే విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడంతో తక్కువ ఎత్తులోనే కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన వెంటనే ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయి పైకి ఎగరాల్సిన విమానం కూలిపోవడంతో సాంకేతిక లోపమే కారణమని అంటున్నారు. 654 అడుగుల ఎత్తులోనే విమానం కూలిపోయిందని కొందరు చెబుతున్నారు. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారని బోర్డింగ్ పాస్ ద్వారా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ విమాన ప్రమాదం పై ఆరా తీస్తున్నారు. విమానం మొత్తం కాలిబూడిదయిపోయింది. శకలాలు మాత్రమే మిగిలిపోయాయి. దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చని చెబుతున్నారు. లండన్ వెళ్లే విమానం కావడంతో రెండు ఫ్యూయల్ ట్యాంక్ ల నిండా పెట్రోలు ఉంటుందని, అందుకే మంటలు వెంటనే ఎగిసిపడ్డాయని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News