రోదసీలోకి శుభాంశు శుక్లా
నలభై ఏళ్ల తర్వాత భారతీయుడు మళ్లీ అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నాడు. శుభాంశు శుక్లా రోదసీలోకి పయనమయ్యాడు
నలభై ఏళ్ల తర్వాత భారతీయుడు మళ్లీ అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నాడు. శుభాంశు శుక్లా రోదసీలోకి పయనమయ్యాడు. సరిగ్గా 12.01 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా దూసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుభాంశు శుక్లా భారత కీర్తి పతాకాన్ని అంతరిక్షంలో రెపరెపలాడేలా అడుగుమోపనున్నాడు.
రేపు సాయంత్రం...
శుభాంశు శుక్లాకు కోట్లాది మంది భారతీయులు, కుటుంబ సభ్యులు ఆల్ ది బెస్ట్ చెప్పారు. శుభాంశు శుక్లాతో కలపి మరో ముగ్గురు వ్యోమగాములను కూడా యాక్సియం-4 తీసుకెళ్లింది. పథ్నాలుగు రోజుల పాటు శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ లో గడపనున్నారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు వ్యోమనౌక అంతరిక్షంలోకి ప్రవేశించనుంది. శుక్లా రోదసీయాత్ర కోసం భారత ప్రభుత్వం దాదాపు 550 కోట్లు ఖర్చు చేయనుంది.