బీజేపీ లోకి నటి మీనా!!

నటి మీనా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Update: 2025-06-26 10:45 GMT

BJP

నటి మీనా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. మీనా బీజేపీలో చేరబోతున్నారని, ఆ పార్టీలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని గురించి అడిగినప్పుడు, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ డైరెక్ట్ గా సమాధానం ఇవ్వలేదు. కానీ రాష్ట్రంలో చాలా మంది ప్రముఖ వ్యక్తులు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని మాత్రం చెప్పారు. ఇటీవల న్యూఢిల్లీలో మీనా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌ను కలిసిన తర్వాత ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Tags:    

Similar News