ఫోర్త్ వేవ్ మొదలవుతుందా? ఎప్పటి నుంచి అంటే?

కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభం కానున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెలాఖరు నుంచి కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి

Update: 2022-06-08 13:19 GMT

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నుంచి కరోనా కేసుల సంఖ్య దేశంలో మరింత పెరిగే అవకాశాలున్నట్లు కూడా వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో ిఇప్పుడు కేసులు అధికంగా కన్పిస్తుననా మరో రెండు వారాల్లో అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, గుంపులుగా తిరగవద్దని కూడా ప్రజలకు సూచిస్తే మేలని వైద్య నిపుణులు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. భారత్ లో గత కొద్దికాలంగా రెండు వేలకు మించని కేసులు నిన్న ఐదువేలు దాటాయి. 5,233 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 28 వేలకు పైగానే ఉన్నాయి.

ఇప్పటి వరకూ.
ఇప్పటి వరకూ కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందన్న భావన లేదు. అందుకే ప్రజలు మాస్క్ లు ధరించడం లేదు. భౌౌతిక దూరాన్ని పాటించడం లేదు. కనీసం శానిటైజ్ కూడా చేసుకోవడం లేదు. ప్రజల అజాగ్రత్తతోనే ఫోర్త్ వేవ్ వస్తుందని చెబుతున్నారు. అయితే లెక్కలు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి సయితం కరోనా సోకదన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఇప్పటికే థర్డ్ డోస్ కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. రోజువారీ డోసుల సంఖ్యను కూడా పెంచింది.
విమాన ప్రయాణికులకు...
దీంతో పాటు తాజాగా విమాన ప్రయాణికులకు మాస్క్ ను తప్పనిసరి చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. అన్ని ఎయిర్ పోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను ఇక ఎయిర్ పోర్టులోకి కూడా అనుమతించరు. ప్రయాణంలో కూడా పూర్తి సమయం మాస్క్ ను ధరించాల్సిందేనని డీజీసీఏ పేర్కొంది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్ కు ముందే నిలువరించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు సయితం కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఫోర్త్ వేవ్ పొంచి ఉందంటున్న వైద్య నిపుణుల హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.


Tags:    

Similar News