Breaking : ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు

Update: 2025-06-15 02:44 GMT

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. కేదార్ నాధ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ప్రతి కూల వాతావరణమే ఈ ప్రమాదానికి గల కారణమని తెలుస్తోంది. గౌరికుండ్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించిక కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురుమరణించారు.

గాయపడిన వారిని...
మరికొందరికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వెంటనే హెలికాప్టర్ వద్దకు భద్రతా సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని చెబుతున్నారు.


Tags:    

Similar News