అలకానంద నదిలో పది మంది గల్లంతు
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అలకానంద నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో పదకొండు మంది వరకూ గల్లంతయ్యారు
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అలకానంద నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో పది మంది వరకూ గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్ లోని ఘోల్తీర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బద్రీనాధ్ నుంచి వెళుతున్న టూరిస్ట్ ల బస్సు అలకానంద నదిలో పడిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ఒకరి మృతి...
ఇప్పటికే ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు. మరో పది మంది అలకానందలో పడి గల్లంతయ్యారు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షంతో అలకానది ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం పద్దెనిమిది మంది పర్యాటకులు ఉన్నారని చెబుతున్నారు.