Aadhaar Card : ఆధార్ కార్డులో ఇంటిపేరు మార్చుకోవాలా? అయితే ఇదీ విధానం

పెళ్లయిన తర్వాత యువతుల చిరునామా మారుతుంది. ఇంటిపేరు మారుతుంది.

Update: 2025-10-11 04:30 GMT

పెళ్లయిన తర్వాత యువతుల చిరునామా మారుతుంది. ఇంటిపేరు మారుతుంది. అయితే వివాహం తర్వాత భారతదేశంలోని మహిళలు సాధారణంగా తమ ఇంటిపేరును భర్త ఇంటిపేరుతో మార్చుకుంటారు. అయితే, ఆధార్ కార్డులో పాత ఇంటిపేరు అలాగే ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే చిరునామా కూడా మారతుంది. అయితే వాటిని మార్చుకునేందుకు సులువైన ప్రక్రియ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పిస్తే మీ పేరు సరిదిద్దుకోవచ్చు. దీనికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో పేరును సరిగ్గా ఉంచడం ఎందుకు ముఖ్యమంటే, ప్రభుత్వ పథకాలు మరియు సేవలు సులభంగా పొందేందుకు దోహదపడుతుంది.

వివాహం అయిన తర్వాత...
వివాహం తర్వాత ఇంటిపేరు, అడ్రస్ మార్చుకునే వారికి ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేసింది. ఈ ప్రక్రియను కనీసం ఒకసారి పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఈ సదుపాయం అందుబాటులో లేదు. ఖచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ మార్పులు చేయాల్సిన విషయాలను ఫారంలో పొందుపర్చాలి.కొత్త ఇంటిపేరును అందులో చేర్చవచ్చు. ఇందుకోసం కొన్ని పత్రాలను ఆధార్ సేవా కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. పేరు మార్పు కోసం కొన్ని పత్రాలను నుంచి ఏదో ఒకటిని అందజేసి ఇంటి పేరును మార్చుకోవచ్చు.
యాభై రూపాయలు చెల్లించి...
మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ కాకుంటే కోర్టు ద్వారా లేదా నోటరీ అనుమతితో కూడిన అఫిడవిట్ కూడా సమర్పించవచ్చు. పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించాలి. పత్రాల పరిశీలన పూర్తయ్యాక, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయబడుతుంది. ఈ ప్రక్రియకు కేవలం యాభై రూపాయలు ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. అప్లికేషన్ ఆమోదం పొందిన తర్వాత, మీకు ఒక *అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఇస్తారు. దీని ద్వారా దరఖాస్తు ఏ పరిస్థితుల్లో ఉందో ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలుంది. వివరాలు అప్డేట్ అయిన తర్వాత, మీ కొత్త ఆధార్ కార్డును UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు














Similar News