భారత సైన్యానికి అండగా తేనెటీగల దళం

భారతదేశానికి సరిహద్దుల్లో తేనెటీగలు సహాయం చేస్తున్నాయి

Update: 2025-06-04 11:45 GMT

భారతదేశానికి సరిహద్దుల్లో తేనెటీగలు సహాయం చేస్తున్నాయి. సరిహద్దుల భద్రత, రక్షణల కోసం తేనెటీగల్ని సైన్యం పెంచుతోంది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోడానికి సరిహద్దు భద్రతా దళం తేనెటీగలను ఉంచింది.


చొరబాట్లతోపాటు, స్మగ్లింగ్‌ను కూడా అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో బీఎస్ఎఫ్ కు చెందిన 32వ బెటాలియన్‌ ముళ్లతీగల కంచెల వద్ద పెట్టెల్ని వేలాడదీసి వాటిల్లో తేనెటీగల్ని పెంచుతోంది. ఎవరైనా ఆ కంచెలను కదిలించినప్పుడు తేనెటీగల గుంపు దాడి చేస్తు చుక్కలు చూపెడుతోంది. తేనెటీగల కోసం పూల మొక్కలను కూడా పెంచుతున్నారు.

Tags:    

Similar News