పట్టాలు తప్పిన రైలు.. అంతా సేఫ్

వెంటనే రైల్వే అధికారులకు సమాచారమివ్వగా.. 20 నిమిషాల్లో అంబులెన్స్‌లు, సహాయక సిబ్బంది..

Update: 2023-01-02 07:10 GMT

mumbai jodhpur train derailed

ముంబై-జోధ్ పూర్ సూర్యనగరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రాజస్థాన్ లో ఆదివారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్ డివిజన్ పరిధిలోని రాజ్‌కియావాస్-బొమద్రా సెక్షన్ పరిధిలో రాత్రి 03.27 నిమిషాలకు రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు.. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. ముంబై (బాంద్రా) నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది.

మొత్తం 8 స్లీపర్ బోగీలు పట్టాలు తప్పడంతో.. ప్రయాణికులు కంగారుపడ్డారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారమివ్వగా.. 20 నిమిషాల్లో అంబులెన్స్‌లు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఎవరికీ ప్రాణహాని లేదని అధికారులు తెలిపారు. రైల్లో 8 బోగీలు పట్టాలు తప్పడంతో.. మిగతా 11 బోగీలు కూడా నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి.. ప్రయాణికులను ఆ బస్సుల్లో తరలించారు. ప్రస్తుతం ప్రమాద పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. త్వరలో ఉన్నతస్థాయి విచారణ చేపడతామని తెలిపారు.





Tags:    

Similar News