40 రూపాయలు లేక పదో తరగతి చదవలేదు.. ఎట్టకేలకు 56 ఏళ్ల వయసులో!!

40 రూపాయలు.. జస్ట్ నలభై రూపాయలు.. లేకపోవడంతో చదువు ఆగిపోయిందంటే నమ్ముతారా?

Update: 2025-05-29 13:37 GMT

tenth grade


40 రూపాయలు.. జస్ట్ నలభై రూపాయలు.. లేకపోవడంతో చదువు ఆగిపోయిందంటే నమ్ముతారా? ఝార్ఖండ్‌లోని ఖూంటీ జిల్లా కలామతి గ్రామానికి చెందిన గంగా ఓరం 56 ఏళ్ల వయసులో పదో తరగతి పాసయ్యాడు. ఆయన ఈ వయసులో 10వ తరగతి పాస్ అయి ఎంతో మందికి ఆదర్శంగా నిలవగా.. చిన్నప్పుడు కేవలం 40 రూపాయలు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించలేక 9వ తరగతితో ఆపేయాల్సి వచ్చిందట.

ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్టు గుమాస్తాగా పనిచేస్తున్న గంగా ఓరంకు భార్య, తల్లితోపాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. చాలాకాలంగా తన ఉద్యోగాన్ని పర్మినెంటు చేయాలని ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. టెన్త్‌ పాస్‌ అవ్వలేదన్న కారణంతో అధికారులు ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టారు. ఇప్పుడు స్థానిక బిర్సా హైస్కూల్లో ఫీజు కట్టి పదో తరగతి చదివారు. 47.2 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.

Tags:    

Similar News