19 మంది విద్యార్థులకు కరోనా.. న్యూ ఇయర్ వేడుకలు బంద్

తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న ఓ పాఠశాలలో ఏకంగా 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడటం అధికారుల వంతైంది. టాక్లీ ధోకేశ్వర్

Update: 2021-12-25 11:43 GMT

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్నది ఏదైనా ఉంది అంటే.. అది ఒమిక్రానే. సౌతాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ భారత్ లో సైతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. మొదట ఒకటి, రెండు కేసులే వెలుగుచూసినప్పటికీ.. రోజులు గడిచే కొద్దీ పదుల సంఖ్యలో కేసులు బయపడుతున్నాయి. దీంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కానీ.. ఒమిక్రాన్ తో పాటు కరోనా కూడా విజృంభిస్తుండటంతో.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న ఓ పాఠశాలలో ఏకంగా 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉలిక్కిపడటం అధికారుల వంతైంది. టాక్లీ ధోకేశ్వర్ గ్రామంలో రెసిడెన్షియల్ సీబీఎస్ఐ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల శాంపిళ్లను కోవిడ్ నిర్థారణ పరీక్షలకు పంపించారు. వాటిలో 19 మందికి పాజిటివ్ గా తేలింది. వారందరినీ పార్నర్స్ రూరల్ హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 19 మంది విద్యార్థులతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముంబైలో బహిరంగ వేడుకలపై ఆంక్షలు
ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేశాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో.. మహారాష్ట్రలోని ముంబై లోనూ పలు ఆంక్షలు విధిస్తూ బీఎంసీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై న‌గ‌రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయ‌ని దీంతో ఆంక్ష‌లు విధిస్తున్నామ‌ని ఆ ప్రకటనలో పేర్కొంది. ప‌ట్ట‌ణంలోని ఏ ప్రాంతంలో అయినా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో న్యూయ‌ర్ వేడుకలు, ఏ ఇతర పార్టీల‌కు అనుమ‌తి లేద‌ని మున్సిపల్ క‌మిష‌న‌ర్ ఐఎస్ చాహ‌ల్ తెలిపారు. కోవిడ్ కేసులను నివారించేందుకు ఈ చర్యలు తీసుకోక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు.


Tags:    

Similar News