భారీవర్షాలకు కూలిన బతుకులు

రెండు ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున..

Update: 2022-09-16 06:46 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడినం కారణంగా తెలంగాణ సహా.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తాజాగా యూపీలో 12 మంది సజీవ సమాధి అయ్యారు. యూపీ రాజధాని లక్నోలోని దిల్ కుషా ప్రాంతంలో శుక్రవారం ఓ ఇంటి గోడ కూలడంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.

యూపీలోని మరో ప్రాంతంలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఉన్నావోలో జరిగింది. ఈ రెండు ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాద ఘటనల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రేపటి వరకూ యూపీలో ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో నేడు యూపీలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. దేశరాజధాని ఢిల్లీలో నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది.




Tags:    

Similar News