దేశంలో ఆగని కరోనా ఉధృతి

24 గంటల్లో భారత్ లో కొత్తగా 11,109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మరణించారు

Update: 2023-04-14 13:19 GMT

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరో రెండు వారాల పాటు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 11,109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని సూచించింది.

ఆ రెండు రాష్ట్రాల్లోనే...
ఇక కొత్తగా నమోదయిన కేసుల్లో ఎక్కువ ఢిల్లీ, మహారాష్ట్రలోనే ఎక్కువగానే నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 49,662గా నమోదయింది. రికవరీ రేటు శాతం 98.70 శాతంగా ఉందని చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఇరవై మంది వరకూ మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ప్రభుత్వాలకు సహకరిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది.


Tags:    

Similar News