నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి

Update: 2025-12-01 02:42 GMT

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. అనేక అంశాలపై నేడు చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. ప్రధానంగా డిగ్రీ ఉగ్రవాదం, ఓటర్ల జాబితా క్రమబద్దీకరణ వంటి అంశాలపై వామపక్షాలు పట్టుబట్టే అవకాశముంది. మరొకవైపు ఉదయం పదిన్నర గంటలకు పార్లమెంటు బయట ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

విపక్షాల సమావేశం...
ఉదయం పది గంటలకు పార్లమెంటు భవనంలో ఉభయ సభలకు చెందిన ప్రతిపక్ష నేతలు సమావేశం కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కీలక అంశాలపై చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించే అవకాశముంది. అధికార పక్షం కూడా విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని ఇప్పటికే సమావేశమై నిర్ణయించింది.


Tags:    

Similar News