Breaking : మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది.
మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. జనవరి 1వ తేదీన ఆయుధాలు వీడతారని తెలిపింది. ఆ తర్వాత మిగిలిపోయిన మావోయిస్టులందరూ ఒక్కసారిగాలొంగిపోతారని ఈ ప్రకటనలో పాల్గొన్నారు. ఒక్కొక్కరిగా లొంగిపోవడం వల్ల లాభం లేదని, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఆయుధాలు వీడాలని నిర్ణయించినట్లు కమిటీ నాయకుడు అనంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఒక్కసారిగా లొంగిపోతే...
మావోయిస్టు పార్టీ అడవుల్లో ఉండి ఉద్యమం చేసే పరిస్థితి లేదు కాబట్టి లొంగిపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు అనంత్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్కసారిగా లొంగిపోవడం వల్ల ఇబ్బందులు కూడా ఉండవని చెబుతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఆయుధాలను వీడాలని నిర్ణయించుకున్నట్లు మావోయిస్టు ప్రతినిధి అనంత్ ప్రకటనలో తెలిపారు.