గరీబ్‌రథ్ రైలులో మంటలు

పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో షాట్ సర్క్యూట్ కారణంగా కోచ్ నెం.19లో భారీగా మంటలు‌ చెలరేగాయి

Update: 2025-10-18 04:59 GMT

పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో షాట్ సర్క్యూట్ కారణంగా కోచ్ నెం.19లో భారీగా మంటలు‌ చెలరేగాయి. అమృత్‌సర్ నుంచి సహర్షా వెళ్తుండగా అంబాల రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు జరిగినట్లు పోలీసులు తెలిపారరు. మిగతా ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి కిందకు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

ప్రయాణికురాలికి గాయాలు...
వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నంచేశారు. మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమయి ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Tags:    

Similar News