జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
జమ్మూ కశ్మీర్ లో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు
ఢిల్లీలో పేలుడు ఘటన మర్చిపోక ముందే జమ్మూ కశ్మీర్ లో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. ఇరవై ఏడు మంది వరకూ గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని నౌగామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ పేలుడు సంభవించింది. గాయపడిన 27 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో మరికొందరిర పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ లో ఉగ్రవాద కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా అర్ధరాత్రి 11.22 గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఒక్కసారి పేలుడు జరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి.
పేలుడు ధాటికి...
పేలుడు ధాటికి మృతుల శరీరభాగాలు మూడు వందల మీటర్ల దూరంలో పడ్డాయి. ఇక పోలీస్ స్టేషన్ లో ఉన్న పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వాహనాలకు కూడా మంటలు అంటున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ తో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఫరీదాబాద్ లోని ఒక ఇంట్లో దాదాపు 360 కిలోల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. స్వాధీనం చేసుకున్న వాటిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వీటి నుంచి నమూనాలను సేకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు.
మృతుల్లో ఎక్కువ మంది పోలీసులే...
బాంబ్ స్క్కాడ్ పోలీసులు మాత్రమే ఈ తనిఖీ చేయాల్సి ఉది. అయితే మరణించిన మృతదేహాలు ఆరు గుర్తుపట్ట లేకుండా పోయాయి. వారిని ఇంకా గుర్తించలేదని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన ఇరవై తొమ్మది మందిలో 24 మంది పోలీసులు, ముగ్గురు సామాన్య పౌరులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసమయింది. అయతే దీనిపై విచారణ జరుపుతున్నామని, అధికారికంగా ప్రకటిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.