రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది
రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రిజర్వేషన్ క్యాన్సిలేషన్ పై ఎటువంటి ఆందోళనలు అవసరం లేదు. రైల్వే రిజర్వేషన్ లో కీలకమైన మార్పులు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో తిరిగి మనకు వచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇక నుంచి ఆ బాధ ఉండదు. రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పటికి దాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఖాళీలను బట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలు కల్పించింది.
వేరే రైలుకు కూడా...
అది కాకుండా రిజర్వేషన్ చేసుకున్న రైలు కాకుండా వేరే రైలుకు కావాలన్నా ఆ రైలుకు కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని బదిలీ చేసుకోవచ్చు.దీని వల్ల క్యాన్సిలేషన్ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. ఈ సౌకర్యం ఇప్పటివరకు రైల్వే శాఖలో లేదు. దేశంలో మొదటిసారిగా రైల్వే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సౌకర్యం ఎక్కడి నుంచి అయినా ఉపయోగించుకోవచ్చు. రిజర్వేషన్ చేసుకున్న చోటు నుంచే కాకుండా ఎక్కడ నుంచి అయినా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.