India : నేటి నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం

నేటి నుంచి దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం కానుంది.

Update: 2025-10-28 04:23 GMT

నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం కానుంది. భారత్ మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేటి నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కానుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ద్వారా కొత్త ఓటర్లను చేర్చుకోవడంతో పాటు నకిలీ ఓటర్లను గుర్తించడం వంటివి చేయనున్నారు.

ఈ రాష్ట్రాల్లో...
నేడు కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్‌, పుదుచ్చేరి, అండమాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎస్ఐఆర్‌ ప్రక్రియ జరగనుంది. డిసెంబర్‌ 9న ముసాయిదా ఎస్ఐఆర్‌ జాబితాను ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటన చేయనున్నట్లు ఇప్పిటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.


Tags:    

Similar News