India : నేడు ఎన్నికల సంఘం కీలక ప్రెస్ మీట్
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది
central election commission
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రకటనను నేడు ఎన్నికల కమిషన్ చేయనుంది. సాయంత్రం 4.15 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం అధికారులు ప్రకటన చేయనున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై...
వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ రాష్ట్రాలతో పాటు మరో పదిహేను రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ను చేయాలని కేంద్ర ఎన్నికల సంఘంొ నిర్ణయించినట్లు తెలిసింది.