Bus Accident : ప్రయివేటు బస్సు ఢీ.. గాయాలతో బయటపడిన ప్రయాణికులు

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

Update: 2026-04-11 03:17 GMT

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అదృష్ట వశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ​కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ​హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ఇంటర్ సిటీ ప్రవేట్ బస్సు ప్రమాదానికి గురయింది.

36 మంది ప్రయాణికులుండగా...
​ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ​ఈ ఘటనలో 16 మందికి గాయాలు వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ​డ్రైవర్ నిద్ర మత్తులో వలన ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ​ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుండి ప్రయాణికులు బస్సు దిగారు.


Tags:    

Similar News