కథానాయకుడిగా స్థానం సుస్థిరం చేసుకోకముందే రానా దగ్గుబాటి రాజమౌళి ఇచ్చిన బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను అంగీకరించాడు. దానితో ఇతర భాష ప్రేక్షకులకు రానా దగ్గుబాటి కండలు తిరిగిన ప్రతినాయకుడిగానే పరిచయం. కానీ తెలుగు ప్రేక్షకులకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ చిత్రం ద్వారా పరిచయమైన రానా దగ్గుబాటి పూర్వ శరీరాకృతి తెలుసు. ఇక ఇప్పుడు బాహుబలి చిత్రం కోసం ఆయన ఎంత కష్టపడి బల్లదేవుని పాత్రకు తనను తాను ప్రతి రోజు సిద్ధం చేసుకుంటారో రానా పర్సనల్ ఫిసికల్ ట్రైనర్ కునాల్ గిర్ తెలిపారు. కేవలం బాహుబలి చిత్రం కోసం మూడు సంవత్సరాల కాల్ షీట్స్ ఇవ్వటమే కాకుండా తన శరీరాన్ని కూడా విరామం లేకుండా కష్టపెడుతున్నాడు అంట రానా.
"ఎనిమిది సంవత్సరాల క్రితం నేను మొదటి సారి రానా ని కలిసాను. అప్పటికి ఆయన ఇంకా లీడర్ చిత్రం కూడా చేయలేదు. నేను తొలి సరి కలిసినప్పటికీ రానా లీడర్ చిత్రంలో కనిపించిన దాని కంటే చాలా సన్నగా ఉండేవారు. కానీ ఆయన బాడీకి వైడ్ స్ట్రక్చర్ మరియు బ్రాడ్ ఫ్రేమింగ్ ఉంటుంది. అది గమనించి నేను అప్పుడే ఇతని ఫీజిక్ తో ఎలాంటి ప్రయోగం అయినా చేయొచ్చు అని అనుకున్నాను. కానీ దానికి అతని నుంచి పూర్తి సహకారం కావలి. అయితే నేను అనుకున్న దానికంటే వర్కౌట్స్ కి ఎక్కువ కష్టపడతాడు. వారంలో దాదాపు ఐదు రోజులు గంటల తరబడి వర్కౌట్స్ చేస్తుంటాడు. ఏ వర్కౌట్ అయినా కొంత కాలానికి సులభం అనిపిస్తుంటుంది. అయితే నను ఒక వర్కౌట్ అలవాటు పడే సమయం కూడా ఇవ్వకుండా కొత్త కొత్త వర్కౌట్స్ చేపించేవాడిని. హెవీ వెయిట్స్ వర్కౌట్ తో రానా అధిక కాలరీస్ ని బర్న్ చేస్తుంటారు. ఆయన డైట్ కూడా చాలా పక్కాగా మైంటైన్ చేస్తారు. రోజుకి ఎనిమిది సార్లుగా ప్రోటీన్ రిచ్ మీల్స్ తీసుకుంటారు. బాహుబలి తరువాతి చిత్రాలలో రానా బాడీ ఇంకా కొత్తగా ప్రెసెంట్ చేయగలుగుతారు అన్న నమ్మకం నాకు వుంది." అని విశ్వాసం వ్యక్తం చేస్తూ రానా శరీరాకృతి రహస్యాలను బయటపెట్టారు రానా పర్సనల్ ఫిసికల్ ట్రైనర్ కునాల్ గిర్.