Hyderabad : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆర్గనైజర్‌పై కేసు నమోదు

పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2026-03-18 06:15 GMT

పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్‌పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు వయోలెన్స్ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు.

రోడ్లపై ట్రాఫిక్ సమస్యతో...
ఈవెంట్ నిర్వహణకు 1,500 మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, 5,000 మందికిపైగా అభిమానులు తరలివచ్చారు. అనుమతికి మించి జన సమీకరణతో రోడ్లపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News