పాత కాలంలో నిర్మితమైన చిత్రాల నిడివి తో పోలిస్తే నేటి తరం చిత్రాల నిడివి బాగా తక్కువ. అప్పట్లో పౌరాణిక కథలు తెరక్కేకించిన మన సినీ పూర్వికులు దాదాపు మూడున్నర గంటల పాటు ప్రేక్షకులను కథనం తో ప్రయాణం చేయించేవారు. నేటి తరంలో క్రీడకు సంబంధించిన కథలతో తెరకెక్కిన లగాన్, ఎం.ఎస్.ధోని ది అంటోల్డ్ స్టోరీ వంటి చిత్రాలు మినహా ప్రేక్షకుడిని అంతా సేపు కట్టడి చేసే సాహసాలు చేయలేకపోయాయి. మన చిత్రాలు కూడా హాలీవుడ్ చిత్రాల నిడివికి చేరువ అవుతుండటం చూస్తున్నాం. అయితే ఇటువంటి రోజా నిడివి చిత్రాలకు దాదాపు 70 సన్నివేశాలు ఉంటాయి. ఇంకొంచం నిడివి పెరిగిన చిత్రాలకు మరో ఐదు నుంచి పది సన్నివేశాల వ్యత్యాసం కనిపిస్తుంది.
ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎస్ 3 చిత్రంలో ఏకంగా 365 సన్నివేశాలు వుంటాయని సమాచారం. అది విని చిత్ర నిడివి ఐదు గంటలకు పైగా ఉంటుంది అనుకుంటే పొరబడినట్లే. రెగ్యులర్ రన్ టైం లోనే చిత్ర నిడివి వుంటూ 365 సన్నివేశాలను బాలన్స్ చేసుకుని తెరకెక్కించారు అంట దర్శకుడు హరి. సాధారణంగానే ఆయన చిత్రాల్లో చాలా రేసీ కథనాలు కనపడతాయి. ఇక ఈ చిత్రంలో ఎటువంటి మాయతో అన్ని సన్నివేశాలను ఇంత తక్కువ నిడివిలోకి కుదించారో తెలుసుకోవాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.