రిపోర్టర్ చేత క్షమాపణ చెప్పించుకున్న బాలీవుడ్ బ్యూటీ

Update: 2016-10-06 12:39 GMT

మన దేశంలో సెన్సార్ నియమ నిబంధనలు ఎంత విస్తృతంగా పెరిగినా అవి మన దర్శక రచయితల ఊహలకు సంకెళ్లు వెయ్యలేవు అని అనేకానేక సార్లు నిరూపితం అవుతూనే ఉంది. దానికి ఒక ప్రధాన కారణం మన ప్రేక్షకుల పై, అలానే ముఖ్యం గా రచయితల పై, దర్శక నిర్మాతల పై విదేశీ చిత్రాల ప్రమేయం ఉండటం. వారి వారి దేశ జీవన శైలిని బట్టి ఆయా దేశాల ప్రభుత్వాలు వారి సెన్సార్ బృందాలకు సినిమాల పై ఆంక్షలు విధించే హక్కులను జారీ చేస్తుంటాయి. ఆలా విదేశీ చిత్రాల ప్రభావంతో మన వాళ్ళు ఇక్కడ అభ్యంతరకరమైన ఎన్నో సన్నివేశాలను చిత్రించటం, తర్వాత సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవటం సర్వ సాధారణం అయిపోయింది కానీ ఆ సన్నివేశాలు మాత్రం సగటు ప్రేక్షకుడికి అంతర్జాలం సురక్షితంగా చేరవేస్తుంది.

ఆలా చిత్ర విడుదల కన్నా ముందే అంతర్జాలం లో ప్రచారమైన సన్నివేశం ఒకటి రాధికా ఆప్తే నగ్నంగా నటించిన పర్చెడ్ అనే చిత్రంలోనిది. ఆ సన్నివేశం గురించి ఒక మీడియా ప్రతినిధి రాధికా ఆప్తే ను తప్పుబట్టగా, అతనికి సమాధానం ఇస్తూ "నేను కథకి ఎం కావాలో అదే చేస్తున్నాను. వివాదం అనేది నేను నగ్నంగా నటించినందుకు రావటం లేదు. మీరు అది చూసి, కథను వదిలేసి కేవలం ఆ సన్నివేశాన్ని మీ ఇతర మిత్రులతో పంచుకోవటం వల్ల జరుగుతుంది. మీరు కథతో పాటు నా పాత్ర గమనిస్తే ఆ నగ్న దృశ్యం ఏది మిమ్మల్ని ఇంత ఆలోచింపచేయదు. నన్ను దాని గురించి ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు అద్దంలో నగ్నంగా చూసుకోగలరా అని ఆలోచించుకోండి. దానికి సిద్ధంగా లేని వారు ఇలా వేరే వారిని నగ్నంగా చూసి ఆనందం పొందటం వల్ల ఎక్కువ కీడు జరుగుతుంది." అని ఘాటుగా సమాధానమిచ్చింది.

రాధికా ఆప్తే తనని తాను నగ్నంగా చూసుకోగలడా అని ప్రశ్నించే స్థాయి కి ఆమెను అసహనానికి గురి చేసాడని గ్రహించిన విలేకరి రాధికా ఆప్తే ను క్షమాపణ కోరాడు.

Similar News