యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్.!

Update: 2016-10-04 05:38 GMT

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ అయిన మ‌హేష్ బాబును యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. పన్నెండు భాషలు, దాదాపు 900లకు పైగా ఇండియన్ టీవీ చానళ్లు.. లైవ్ టీవీ ఎనీటైమ్ ఎనీవేర్ అనే స్లోగన్‌తో స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ లలో ఇంటర్నెట్ వీక్షకులకు లైవ్ టీవీ చూసే అవకాశాన్ని కల్పిస్తోంది యప్ టీవీ. ఒక్కమాటలో చెప్పాలంటే ఆన్‌లైన్ చానల్స్ ప్రొవైడర్లలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న యప్ టీవీకి సూపర్‌స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌత్ ఆసియాలోనే కంటెంట్ ను క‌లిగి ప్ర‌పంచ‌లో అతిపెద్ద ఆన్ లైన్ స్ట్రీమింగ్ అయిన యప్ టీవీ మహేష్ ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌క‌టించింది.

సినీరంగంలో చాలా ప్రముఖమైన సెలబ్రిటీ మ‌హేష్ బాబు. టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ స‌ర్వే కూడా ఆయ‌న్ని బాలీవుడ్ సెల‌బ్రిటీల స‌ర‌స‌న నిలబెట్టింది. మరి ఇప్పుడు గొప్ప అందం వ్య‌క్తిత్వం కలిగిన మహేష్ అత్యాధునిక టెక్నాలజీని ఉప‌యోగించి రూపొందించే వీడియోల‌ను ప్రపంచానికి అందిస్తోన్న య‌ప్ టీవీతో ఆయన ప్రతిష్ట మరింతగా ఇనుమ‌డిస్తుందనే చెప్పాలి.

తాజ్ కృష్ణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఎంట‌ర్ టైన్ మెంట్ లో నా మొద‌టి ఛాయిస్ య‌ప్ టీవీ. నాక తెలిసి వినోదానికి భ‌విష్య‌త్తు ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ రంగానిదే. అటువంటి రంగంలో ఇప్పుడు కాలాన్ని బట్టి ఎంతో అడ్వాన్స్ గా ముందుకు దూసుకుపోతున్నయ‌ప్ టీవీతో అనుబంధం కుదుర్చుకోవ‌డం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. నేను ఆరు సంవ‌త్స‌రాల క్రితం దూకుడు సినిమా షూటింగ్ చేస్తూ విదేశాల్లో ఉన్న‌ప్పుడు ఓ నిర్మాత ఫోన్ లో న్యూస్ ఛాన‌ల్ చూస్తున్నాడు. ఫోన్ లో న్యూస్ ఛాన‌ల్ ఎలా చూడ‌గ‌లుగుతున్నారు మీరు అని నేను అడిగితే య‌ప్ టీవీ ద్వారా అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆహా అద్భుతం అనిపించింది. ఇప్పుడు నేను అలాంటి అద్భుతమైనదని నాకు అనిపించిన య‌ప్ టీవీతో అసోసియేట్ అయినందుకు చాలా ఆనందంగానూ గ‌ర్వంగానూ ఉంది అన్నాడు మహేష్ బాబు.

య‌ప్ టీవీ వ్య‌వ‌స్ధాప‌కులు, సీఈఓ ఉద‌య్ రెడ్డి మాట్లాడుతూప్ర‌పంచ వ్యాప్తంగా య‌ప్ టీవీ గ‌త కొన్నేళ్లుగా అద్భుతంగా ఘ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. మా ఈ ప్ర‌యాణంలో మా బ్రాండ్ మ‌రింత ద్విగుణీకృతం అయ్యేందుకు భార‌త్ తో పాటు విదేశాల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో అనుబంధం కుదుర్చుకున్నాం. ఈ బంధం ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత మందిలోకి మా బ్రాండ్ ను చేర్చేందుకు ఉపయోగప‌డుతుంది అని అన్నారు.

Similar News