తెలుగు తమిళ భాషలలో అడపాదడపా విజయవంతమైన చిత్రాలలో కనిపించినా గుర్తింపు ఉన్న పాత్రలు మాత్రం తాప్సి పన్ను కి బాలీవుడ్ ఏ ఇవ్వగలిగింది అని చెప్పాలి. తాజాగా ఆవిడ చేసిన హిందీ చిత్రాలు అన్ని సక్సెస్ అవ్వటంతో పాటు ప్రతి సక్సెస్లోనూ తాప్సి కష్టం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ముఖ్యంగా బేబీ, పింక్ చిత్రాలలో తాప్సి పోషించిన పాత్రలు హిందీ చిత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక తాప్సి కూడా తెలుగు తమిళ పరిశ్రమలో అగ్ర కథానాయిక స్థానాన్ని ఆక్రమించాలనే ఆలోచనలు పక్కనబెట్టి హిందీలో వస్తున్న అవకాశాలు సద్వినియోగ పరుచుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది.
నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన బేబీ చిత్రం అటు వసూళ్ల పరంగా ఇటు ప్రశంసల పరంగాను అగ్ర స్థానం పొందింది. ఇప్పుడు ఆ చిత్ర సీక్వెల్ తెరకెక్కించే పనిలో నింగనమై ఉన్నాడు దర్శకుడు నీరజ్ పాండే. మొదటి భాగంలో అద్భుత నటన కనబరచిన తాప్సిని సీక్వెల్ లోనూ భాగం చెయ్యాలనుకున్నాడు నీరజ్. తాప్సి కూడా బేబీ సీక్వెల్ లోని తన పాత్రకు చాలానే కష్టపడుతుంది. ఈ చిత్రం కోసం తాప్సి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, జపనీస్ మార్షల్ ఆర్ట్స్, క్రాప్ మగా నేర్చుకుంది. యాక్షన్ సన్నివేశాలను సహజంగా నటించి రక్తికట్టించాలని తాపత్రయ పడుతుంది తాప్సి.
తాప్సి పన్ను ప్రస్తుతం రన్నింగ్ షాదీ డాట్ కం, ఘాజి, తడ్కా, నామ్ షబానా అనే నాలుగు హిందీ చిత్రాల్లో నటిస్తుంది.