మారుతి మహానుభావుడు ఇతడేనంట

Update: 2016-12-09 16:22 GMT

ఎక్స్ ప్రెస్ రాజా విజయం ఇచ్చిన ఉత్సాహంతో నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి, మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ చిత్రం అయినా ఖైదీ నెం.150 లను కూడా లెక్కచేయకుండా 2017 సంక్రాంతి కూడా తన చిత్రం శతమానం భవతి విడుదల ఖాయం చేసాడు శర్వానంద్. ఈ ధైర్యం వెనుక ఎక్ష్ప్రెస్స్ రాజా తో పాటు మరో ముఖ్య కారణం నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే శర్వానంద్ ఈ చిత్రానికి డబ్బింగ్ కూడా పూర్తి చేసేసి తదుపరి చిత్రాల చిత్రీకరణ పట్టాలెక్కించటానికి కృషి చేస్తున్నాడు. శతమానం భవతే ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూనే మారుతి దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి సన్నద్ధమవుతున్నాడు శర్వానంద్.

ఇటీవలి కాలంలో దర్శకుడు మారుతీ మహానుభావుడు అనే టైటిల్ ని రిజిస్టర్ చేసాడు. ఇంతలో మారుతీ చెప్పిన కథ నచ్చటంతో శర్వానంద్ శతమానం భవతే తరువాత మారుతీ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. సో ఇప్పుడు మారుతీ రిజిస్టర్ చేపించిన టైటిల్ శర్వా కోసమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో వాస్తవముందా లేక మారుతీ మరే ఇతర హీరో సినిమా కోసమైనా రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నాడా అనే సందేహాలకు మారుతీ స్పందించలేదు. టైటిల్ ఏదైనప్పటికీ వరుస విజయాలతో ద్దోసుకుపోతున్న శర్వానంద్ భలే భలే మగాడివోయి వంటి సూపర్ హిట్ ఇచ్చిన మారుతీ దర్శకత్వంలో చేస్తే మంచి చిత్రమే వస్తుంది అనే అంచనాలు వున్నాయి. భలే భలే మగాడివోయి భారీ విజయం తరువాత బాబు బంగారం అంతటి సంచలనం సృష్టించక పోవటంతో మారుతీ తిరిగి చిన్న స్థాయి కథానాయకులతోనే పనిచేయటానికి సిద్దపడి ఈ కథ తయారు చేసుకునట్టున్నారు. ఈ నెల లోనే ఈ చిత్రం ముహూర్తం జరుపుకోనుంది. రెగ్యులర్ షూటింగ్ 2017 సంక్రాంతి పండుగ తరువాత ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయి.

Similar News