మరో రాజమౌళి కావాలని వీరూ కోరిక

Update: 2016-10-07 05:46 GMT

రచయిత నుంచి దర్శకులు గా మారి అగ్ర దర్శకుల స్థాయికి చేరుతున్న దర్శకుల సంఖ్యా నానాటికి పెరిగిపోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, పరశురామ్, రవీంద్ర(బాబీ) వంటి వారు ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అగ్ర దర్శకులుగా చలామణి అవుతున్నారు. ఆ జాబితాలో తన పేరు నిలుపుకోనప్పటికీ వీరూ పోట్ల కూడా ఆ కోవకే చెందుతాడు. రచయితగా వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి విజయవంతమైన చిత్రాలకు పని చేసి దర్శకుడిగా మారి బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగా కూడా సక్సెస్ రేట్ బాగానే ఉన్నా, అగ్ర స్థానం చేరుకోవడంలో వెనుకంజలో ఉండిపోవటానికి కారణాలు, తన వ్యక్తిగత అభిప్రాయాలూ వ్యక్త పరిచారు వీరూ పోట్ల.

"రగడ చిత్రం విడుదల తర్వాత నేను చెయ్యవలసిన చిత్రాలు రెండు చేజారిపోయాయి. దానికి రగడ చిత్ర వైఫల్యం ఒక కారణం కావొచ్చు. అందుకే దూసుకెళ్తా తెరకెక్కించటానికి ఆలస్యం జరిగింది. అనుకోకుండా ఆ రెండు చిత్రాల మధ్య మూడు సంవత్సరాల వ్యవధి ఏర్పడింది. దూసుకెళ్తా విజయం పొందిన తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవటం నా దురదృష్టమే ఏమో. దూసుకెళ్తా కి ఇప్పుడు విడుదల అవుతున్న ఈడు గోల్డ్ ఎహె కి మధ్యకూడా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. వెనువెంటనే చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తే తప్ప మార్కెట్ లో మన స్థాయి పెరగదు. నాకు కూడా బాహుబలి స్థాయి చిత్రం చెయ్యాలనే ఉంది. కానీ ప్రస్తుత నా మార్కెట్ కు అవి చెయ్యటం సాధ్యపడదు. కానీ ఏనాటికైనా బాహుబలి స్థాయి చిత్రాన్ని తెరకెక్కిస్తాను." అని ధీమా వ్యక్తం చేస్తున్నారు వీరూ పోట్ల.

వీరూ పోట్ల దర్శకత్వం వహించిన ఈడు గోల్డ్ ఎహె చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రం అయినా వీరూ పోట్ల స్థాయి మార్చగలుగుతుందేమో చూడాలి

Similar News