అనుక్షణం ఉత్కంఠతో సాగే కథనాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ లభిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో విడుదలై మల్టీప్లెక్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఆంగ్ల చిత్రం డోంట్ బ్రీత్. దొంగతనానికి ఒక గుడ్డివాడైన వృద్దుడి ఇంటికి వెళ్లిన ఇద్దరు యువకులు, ఒక యువతీ ఆ రాత్రి ఎదుర్కొనే గడ్డు పరిస్థితుల నేపథ్యంలో సాగే కథనంతో ఫెడ్ అల్వరెజ్ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. చిత్రం మొత్తం ఒకే ఇంట్లో పరిమిత పాత్రల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ప్రేక్షకులు ఉతకంతతో ప్రతి సన్నివేశానికి కొత్త అనుభూతిని పొందుతారు.
ఈ చిత్ర రీమేక్ హక్కులను చియాన్ విక్రమ్ కోసం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకునే విక్రమ్ ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ చేయలేదు. ఈ చిత్రంతో అభిమానులకు ఆ లోటు కూడా తీర్చనున్నాడు చియాన్ విక్రమ్. ఈ రీమేక్ హక్కులను కొన్న నిర్మాతలు తమిళంలో మాత్రమే నిర్మిస్తారా లేక తెలుగులోకి అనువదిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. నటుడిగా ఎంతో గొప్ప స్థాయిలో నిలిచిన విక్రమ్ కమర్షియల్ హీరోగా మాత్రం వెనుకంజలోనే ఉన్నాడు. మరి ఈ ఆంగ్ల చిత్ర రీమేక్ ఐన విక్రంకి కమర్షియల్ హీరో హోదా కలిపిస్తుందో లేదో చూడాలి.
డోంట్ బ్రీత్ రీమేక్ ని ఎవరు దర్శకత్వం చేస్తారు, విక్రంతో నటించే తోటి నటీనటుల వివరాలు, చిత్రీకరణ ప్రారంభ వివరాలు ఏవి అధికారికంగా వెల్లడించలేదు.