మరీ బొద్దుగుంటే కష్టమే....! 

Update: 2016-10-05 14:38 GMT

ఒకసారి మీడియా వాళ్లు నిత్యామీనన్‌ తన హైట్‌ కంటే ఎక్కువ బరువు ఉందనే ఉద్దేశ్యంతో కాస్త నాజూకుగా కనిపించరా? అని ప్రశ్నించారు. దానికి నిత్య మీడియాకు పెద్ద క్లాసే తీసుకుంది. గతంలో తెలుగులో ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన పాతతరం హీరోయిన్లు కొంరినీ ఉదాహరణగా చూపించి, అదేం లేదు. బొద్దుగా ఉన్నా టాలెంట్‌ ఉంటే గుర్తిస్తారంటూ క్లాస్‌ చెప్పింది. తమిళం సంగతేమో గానీ తెలుగులో మాత్రం కాస్త నాజూకుగా ఉన్న హీరోయిన్లే రాణిస్తారు. ముఖ్యంగా నడుం దగ్గర కొవ్వు పెరిగితే మాత్రం ఎవరినైనా సైడ్‌ ఉంచేస్తారు. అనుష్క వంటి హీరోయిన్‌కు కూడా 'సైజ్‌జీరో' తర్వాత 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌', 'సింగం3' విషయాల్లో ఇబ్బందులు తప్పలేదు.

తాజాగా నిత్యామీనన్‌ త్వరలో విక్టరీ వెంకటేష్‌ సరసన ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటింనుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు.. మీకు జోహార్లు'గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మద్యవయస్కుడైన వెంకటేష్‌కు, ఓ యువతి నిత్యామీనన్‌కి మధ్య జరిగే కథతో ఈ చిత్రం కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా రూపొందే ఈ చిత్రం జనవరి నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా 'జనతాగ్యారేజ్‌'లో మరీ శరీరం విషయంలో టూయాడ్‌గా కనిపించిన నిత్యామీనన్‌ను కాస్త బరువు తగ్గించుకోవాలని యూనిట్‌ కోరడంతో పాత్ర కోసం తగ్గమంటే తగ్గుతాను.. కానీ అదే పనిగా అవసరం లేకపోయినా తగ్గమంటే ఎలా? అని నిత్యా తెగ ఇదైపోతోంది.

Similar News