పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు భారత్ ఆగ్రహిస్తున్న కోణం మాత్రమే మనం చూస్తున్నాం. సహజంగానే దీనికి రెండో పార్శ్వం కూడా ఉంది. భారత సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నదంటూ.. పాకిస్తాన్ లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ మన బాలీవుడ్ సినిమాల మీద నిషేధం విధించారు.
అయితే ట్విస్టు ఏంటంటే.. బాలీవుడ్ సినిమాలను నిషేధించడం అనేది నిజానికి పాకిస్తాన్ కే నష్టం అనేది ఒక అంచనా. పాకిస్తాన్ సినిమా పరిశ్రమ 70 శాతం బాలీవుడ్ సినిమాల మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటుంది. నిజానికి వారు కాదు కదా.. మన బాలీవుడ్ గనుక పాకిస్తాన్ మీద నిషేధం విధిస్తే.. అక్కడి వినోదరంగం కుదేలైపోతుంది. అయితే.. ఏదో డాంబికానికి అన్నట్లుగా , మేకపోతు గాంభీర్యం లాగా అక్కడి ప్రముఖ సినిమా థియేటర్ సంస్థ సూపర్ సినిమా తాము బాలీవుడ్ సినిమాలను వేయబోవడం లేదని ప్రకటించడం గమనార్హం.