ప్రత్యేక గీతంపై ఆశపడుతున్న మాజీ విశ్వ సుందరి

Update: 2016-12-10 21:58 GMT

యావత్ భారత దేశ సినిమా అభిమానులకు కన్నుల విందుగా బాజీరావు మస్తానీ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. ఆ చిత్రంలో దీపికా పదుకొనె ప్రధాన కథానాయిక అయినప్పటికీ రాజ దర్బార్ లో దీపికా నృత్యకారునిగా మస్తానీ మస్తానీ పాటకి చేసిన నృత్యం అందరిని కట్టిపడేసింది. ఆ పాటకి ఇంతటి గుర్తింపు దక్కటానికి బన్సాలి ఎంచుకున్న కోరియోగ్రఫీ తో పాటు వేసిన సెట్, లైటింగ్ ఎఫెక్ట్, సంగీతం, కథలోని సన్నివేశం అన్నీ ఆ పాటను అంతలా బాల పరిచాయి. సంజయ్ లీలా బన్సాలి ప్రస్తుతం పద్మావతి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వరుసగా మూడవ సారి దీపికా పదుకొనె బన్సాలి చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మెరవటానికి మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఉవ్విళ్ళూరుతున్నట్టు సమాచారం. తనంతట తానే పద్మావతిలో ప్రత్యేక గీతం చేస్తానని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ని సంప్రదించింది అంట ఐష్. గతంలో హమ్ దిల్ దే చుకే సోనమ్, దేవదాస్, గుజారిష్ చిత్రాలతో బన్సాలీతో వున్న చనువుతో ఐష్ పద్మావతిలో తన నృత్య ప్రదర్శనకి ఏర్పాట్లు చేసుకుంటుంది. గతంలో ఐష్ నృత్యించిన కజరారే కజరారే పాట ఎంత సంచలనం చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ పాట తరువాత ఐష్ నృత్యించబోయే ప్రత్యేక గీతం పద్మావతి చిత్రం లోనే కావటం విశేషం. 2017 నవంబర్ 11 న పద్మావతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Similar News