పెళ్లి పుణ్యమాని బిజినెస్ పోయిందిట

Update: 2016-12-09 23:46 GMT

ఎంత లేదనుకున్నా ఏడాదికి కొన్ని కోట్ల రూపాయల రాబడి.. చూస్తూచూస్తూ బిజినెస్ ఢామ్మని పడిపోతే ఎలా ఉంటుంది? గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతం హీరోయిన సమంత పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుంది. నాగచైతన్యంతో పెళ్లి నిశ్చయమైన తర్వాత.. తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని, తనను అందరూ దూరం పెడుతున్నారని, ఎందుకో అర్థం కావడం లేదని సమంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి ఇప్పట్లో లేకపోయినా.. దాని తాలూకు ఎఫెక్టు మాత్రం ఇప్పటినుంచే ఆమెకు కనిపిస్తున్నట్లుంది. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యలూ ఈ పోకడపై ఆమె అసహనం వ్యక్తంచేసింది.

‘‘నాగార్జున కోడలు ఆమెతో ఎలా పనిచేయగలం’’ అని నిర్మాతలు అనుకుంటున్నట్లున్నారని, పెళ్లివలన తాను నటించడం మానేస్తే నాగార్జునే ఎక్కువ బాధపడతారని సమంత నమ్మకం వెలిబుచ్చడం విశేషం. ఈ ఏడాదిలో తన ఖాతాలో మూడు హిట్ లు ఉన్నప్పటికీ కొత్త అవకాశాలు మాత్రం రావడం లేదని ఆమె వాపోతున్నారు. తాను మాత్రం పెళ్లయిన తర్వాత కూడా నటించడాన్ని కొనసాగిస్తానని, నిర్మాతల్లో పెళ్లయిన హీరోయిన్ల పట్ల అభద్రత తొలగాలని, తాను పెళ్లి కాగానే ఎటూ వెళ్లేది జరగదు, ఇక్కడే ఉంటా అని సమంత సెలవిచ్చారు.

నాగచైతన్యతో పెళ్లి విషయంలో మాత్రం ఆమె హేపీగా ఉన్నారు. మేం వచ్చే ఏడాది చివర్లో మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అతని కుటుంబంతో నా భవిష్యత్తు గురించి సందేహం లేదు, కానీ సినిమా కెరీర్ లో నా భవిష్యత్తు గురించి సందేహంగా ఉంది. అని సమంత భయాలు వ్యక్తీకరిస్తున్నారు. మరో ఏడాది పాటు అంటే వచ్చే ఏడాది చివర్లో పెళ్లి చేసుకునే వరకు ఆమెలో అవకాశాలు పోతున్నాయనే ఈ అసహనం చిరాకు ఎంతగా పెరుగుతాయో ఏమిటో?

Similar News