పవన్ మరదలు అనేసరికి ఆసక్తిగా చూస్తున్నారు

Update: 2016-09-26 00:22 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంబినేషన్లు చాలా విలువైనవి. ఎవరితో .. మనం పనిచేశాం అనేదానిని బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. మన టేలెంటును బట్టి మాత్రం కాదు. అలాంటప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మరదలు అనగానే.. ఆ అమ్మాయికి తతిమ్మా బాలీవుడ్ ప్రొడ్యూసర్ల వద్ద క్రేజ్ ఏర్పడడంలో ఆశ్చర్యం ఏముంది. ఇప్పుడు అదే జరుగుతోంది.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించాలని హీరోయిన్లే కాదు..... క్యారెక్టర్‌ ఆర్టిస్‌లతో పాటు అందరూ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరికైనా కొత్తవారికి ఆ అవకాశం వచ్చిదంటే ఎగిరిగంతేస్తారు. కాగా ప్రస్తుతం పవన్‌ హీరోగా డాలి దర్శకత్వంలో రూపొందుతున్న 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌ ఈమధ్యే ప్రారంభమైంది. కాగా ఈ చిత్రంలో పవన్‌కు మరదలు పాత్ర ఊహించకుండా ఓ ఆర్టిస్గ్‌కు వచ్చింది. మోడల్‌గా, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టుగా, డ్యాన్సర్‌గా మంచి ప్రతిభ కలిగిన నటి మానస హితవర్ష. కాగా కాటమరాయుడు చిత్రంలో ఆమె పవన్‌కు కొంటెమరదలిగా, లంగా,ఓణి, జాకెట్‌ వేసుకొని కొంటే వేషాల్లో నటించే అవకాశం ఈ భామకి వచ్చింది. ఈమె ఇంతకు ముందు 'రొమన్స్‌' చిత్రంలో కూడా నటించింది. ఇప్పుడు ఆమె టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయింది. తాను పవన్‌కు చిలిపి అల్లరి మరదలిగా నటిస్తున్నానని, ఆయనతో ఎప్పుడు షూటింగ్‌ మొదలవుతుందా? అని వేయ్యి కళ్లతో వేచిచూస్తున్నానని ఆమె అంటోంది. మొత్తం మీద ఈ చిత్రంలో ఆమెకు అవకాశం రావడం ఒక విధమైన అదృష్టమేనని అందరూ ఒప్పుకుంటున్నారు.

Similar News