జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం తాలూకు టీజర్ విడుదలకు ముహూర్తం కూడా ఫిక్సయిపోయింది. కమెడియన్ శ్రీనివాసరెడ్డిని హీరోగా పెట్టి చేస్తున్న మరొక ప్రయత్నం ఇది. గతంలో శ్రీనివాసరెడ్డి.. గీతాంజలి చిత్రంలో హీరోగా చేశాడు. అయితే.. తర్వాత హీరో వేషాలు మాత్రమే వేస్తానంటూ మడికట్టుకుని కూర్చోకుండా.. తిరిగి తన ట్రాక్ లోని కమెడియన్ వేషాలు కూడా వేసుకుంటూ కెరీర్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా మళ్లీ ఇందులో హీరో పాత్రను పోషిస్తున్నాడు.
ఈ చిత్రం ఫక్తు ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లో ఉంటుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అర్బన్ లుక్ ఉన్న చిత్రం కాదని, పక్కా నాటు గ్రామీణ తరహా కామెడీ తో అన్ని వర్గా లప్రేక్షకులను అలరిస్తుందని అనుకుంటున్నారు.
శ్రీనివాసరెడ్డికి తన కెరీర్ ప్లానింగ్ లో చాలా క్లారిటీ మరియు భయం ఉన్నట్లుంది. గతంలో హీరో రోల్స్ కు పరిమితం అవుతారా అని అడిగితే.. అలాంటి పొరబాటు చేయను అని చెప్పేవాడు. తద్వారా కమెడియన్ గా అవకాశాల్ని కాపాడుకున్నాడు. మరి ఈ చిత్రం గనుక బాక్సాఫీసు వద్ద నిలబడితే.. ఆ తర్వాత కూ డా కమెడియన్ వేషాలకు ఓకే చెప్తాడా లేదా, ఓన్లీ హీరో రోల్స్ అంటూ తలెగరేస్తాడా చూడాలి.