ఈ మధ్యన జరిగిన పాకిస్తాన్ పై సర్జికల్ దాడులను దేశ వ్యాప్తం గా అందరూ నరేంద్ర మోడీని తెగ పొగిడేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల సైతం మోడీని మనస్ఫూర్తిగా అబినందించారు. మోడీ సరైన టైములో సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆయన కూడా ఈ దాడులు జరిగిన తర్వాత దేశం లోని పెద్దలైన రాష్ట్రపతి దగ్గరనుండి ప్రతిపక్ష నాయకుడి వరకు అందరికి సర్జికల్ దాడుల సమయం జరిగిన పరిణామాలను ఫోన్ చేసి మరి స్వయం గా వివరించారు, ఈ విషయం లో మోడీని అందరూ మెచ్చుకున్నారు కూడా.
అయితే హైదరాబాద్ లో తాజాగా సర్జికల్ దాడుల గురించి ఒక ఛానెల్ ఒక చర్చ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సినీ నటుడు పోసాని కృష్ణ మురళి, సీనియర్ నాయకుడు వి. హనుమంతురావు కూడా పాల్గొన్నారు. అయితే ఈ చర్చలో పాల్గొన్న పోసాని భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంశలతో ముంచెత్తాడు. భరత్ లో వున్న రాజకీయ నాయకులలో మోడీ అత్యంత నిజాయితీ పరుడని.....ఇప్పటివరకు మోడీ ని ఒక్క అవినీతి మరక కూడా అంటలేదని తెగ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక ఆ పొగడ్తలను వింటున్న వీహెచ్ కి చిర్రెత్తుకొచ్చింది. ఎందుకంటారా..! విహెచ్ కాంగ్రెస్ నాయకుడాయె... మోడీ బిజెపి నేత కావడం తో మోడీని పొగుడుతుంటే వీహెచ్ కాలడం పెద్ద విశేషమేమీ కాదు. అందుకే వీహెచ్ ఇలా పొగడ్తలు చెయ్యడం ఆపవయ్యా..! పొగడాలనుకుంటే బయటికెళ్లి పొగుడు అని ఒక హెచ్చరిక జారీ చేసాడు. పోసాని కూడా తగ్గడు కదా! ఇక వీరిద్దరి మధ్య గొడవ మొదలై అసభ్య పదజాలం తో ఇద్దరికిద్దరు బండ బూతులు తిట్టుకుని అక్కడ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు.
మోడీ గారు పాకిస్తాన్ కి వెళ్లి నవాజ్ షరీఫ్ చీర ను బహూకరించి మరీ భారత్ పాక్ ల సంభందాలు మెరుగు పడాలని ప్రయత్నించారని అయినా పాక్ మారలేదని పోసాని అన్నారు.దీనితో సర్జికల్ దాడులుచేయాలన్న మోడీ నిర్ణయం ఉత్తమమైనదని అన్నారు. ఇక వీరిద్దరి వాగ్వాదం ఇప్పుడు వీడియో రూపంలో అందరికి దర్శనమిస్తుంది. ఇక ఈ వీడియో ని తిలకించిన వారందరూ ఆమ్మో ఇంతిలా తిట్టుకుంటారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.