కండలవీరుడిపై అంతా కస్సుమంటున్నారు

Update: 2016-10-04 14:39 GMT

భారత్‌. పాక్‌ల మద్య ఉద్రిక్తలు తొలగలేదు. సరిహద్దుల్లో యుద్దవాతావరణం ఏర్పడి ఉంది. దీంతో ఆగ్రహించిన దేశంలోని పలు హిందుత్వ వాదులు తమ దేశాన్ని వదిలి వెంటనే వెళ్లిపోవాలని పాక్‌ నటీనటులకు అల్టిమేటం జారీచేశారు. ఒక వైపు పాక్‌ ఉగ్రవాదులతో పోరాడుతూ మరోపక్క పాకిస్దాన్‌కు చెందిన నటీనటులను తమ చిత్రాల్లో తీసుకొచ్చే పరిస్దితి మంచిది కాదని అందరు ఫీలవుతున్నారు. వందకోట్లకు పైగా ఉన్న భారతీయుల్లో మీకు టాలెంటు ఉన్నవారు లేరా? పాకిస్దాన్‌ నటీనటులకు ప్రత్నామాయం లేదా? అని మేథావులు కూడ ప్రశ్నిస్తున్నారు. కానీ పాకిస్దార్‌ కళాకారులపై మమకారంతో వారిపై సల్మాన్‌ఖాన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో ఇండియాలోని పలువురు మండిపడుతూ అంతగా నీకు ఇష్టం ప్రకారంతో మాట్లాడటం తగదని, అంత ప్రేమ ఉంటే సల్మాన్‌ఖాన్‌ దేశం విడిచి పాకిస్తాన్‌కు వెళ్లాలని సల్మాన్‌ఖాన్‌పై మండిపడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ప్రతిసారి సల్మాన్‌,షారుక్‌, అమీర్‌ల నోటికి దూల ఎక్కువగా ఉండటంతో త్వరలో ఖాన్‌ త్రయం ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడ స్చేచ్చను అనుభవిస్తూ ఈ ఖాన్‌లు పాకిస్తాన్‌కు, చివరకు ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఇప్పుడు స్టార్స్‌గా ఎదుగుతున్న ఖాన్‌లపై ఆయన అభిమానులైనవారు వారిని అభిమానించడం చూసిన వారు ఇప్పుడు వారిపై మండిపడుతున్నారు. కాగా సల్మాన్‌ విషయంలో మన నటుడు, రచయిత, దర్శకుడు పోసాని ఘాటుగా స్పందించారు. ఈ దేశంలో ఉన్న అసలైన ఉగ్రవారి సల్మానేనని, ఆయన అంత మంచివాడైతే ఆనాడు కారు నడుపుత్తూ వెళ్లిన సల్మాన్‌ అక్కడ ప్రమాదంలో స్దలంలో ఉండలేదని, పారిపోయాడని పోసాని దుయ్యబట్టారు. మొత్తానికి ఈ మధ్య ఖాన్‌ త్రయంకు మద్దతును పక్కనపెట్టి, మన దేశ నటీనటులనే మనం గౌరవిద్దాం.. అనే నినాదాన్ని మన హీరోలు అమలు చేయాలని మెజార్టీ దేశభక్తులు అభిప్రాయపడుతున్నారు.

Similar News