డిసెంబర్ 9 న వాణి కపూర్ నటించిన హిందీ చిత్రం బేఫికర్ చిత్రం విడుదల అవుతుండటంతో ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా మీడియా వారికి అందుబాటులో వుంటూ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది వాణి కపూర్. శుద్ దేశి రొమాన్స్ చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన వాణి కపూర్ ఆశించిన స్థాయిలో యువ ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. లుక్ మార్చి మూడు సంవత్సరాల తరువాత మళ్లీ బాలీవుడ్ లో చిత్రం చేసిన వాణి కపూర్ మొదటి చిత్రంలో కనిపించిన దానికి పూర్తి బిన్నంగా కనిపిస్తూ పోస్టర్స్లో దర్శనమిస్తుంది. దీనితో అమ్మడు కాస్మెటిక్ సర్జరీ తో ఆ లుక్ తెచ్చుకుంది అని వస్తున్న వార్తలు నిజామా అని ప్రశ్నించిన విలేఖరికి ఘాటుగానే సమాధానం ఇచ్చింది వాణి కపూర్. శరీర బరువు తగ్గటంతో తన ముఖంలో కూడా మార్పు కనిపిస్తుంది అని దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్ధం కావటం లేదు అని విచారించింది వాణి కపూర్.