అదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్‌కు పండుగే....! 

Update: 2016-10-05 14:38 GMT

ఇటీవల తన వయసుకు తగ్గట్లుగా విభిన్న కథాంశాలు, గెటప్స్‌తో వచ్చి ఇప్పటికీ తన కొడుకులైన నాగచైతన్య, అఖిల్‌ల కంటే విభిన్న ప్రయోగాలు చేస్తున్నాడు కింగ్‌ నాగార్జున. ఆయన చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' తో పాటు వంశీపైడిపల్లి 'ఊపిరి' చిత్రంలో కేవలం వీల్‌చైర్‌కే పరిమితమయ్యే పాత్రతో అద్బుతంగా నటించాడు. కాగా ప్రస్తుతం మరలా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రియ భక్తుడైన హతీరాంబాబాగా ఆయన మారిపోయాడు. గెడ్డం పెంచుకొని ఆ పాత్రలో లీనమై నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా జనవరిలోనే విడుదల కానుంది.కాగా మలయాళంలో ఇటీవల ఓ అంధుడుగా నటించిన మోహన్‌లాల్‌ నటించిన 'ఒప్పం' చిత్రాన్ని ఎలాగైనా నాగార్జున చేస్తేనే బాగుంటుందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

కేవలం 10కోట్లలోపు బడ్జెట్‌ చిత్రం ఇప్పుడు దాదాపు 50కోట్ల మార్క్‌కు దగ్గరయింది. ఎలాగూ తన కుమారుడు నాగచైతన్య మరో మలయాళ రీమేక్‌గా 'ప్రేమమ్‌' చేస్తున్నాడు. ఇక నాగార్జున కూడా ఇటీవల 'ఒప్పం' చిత్రాన్ని చూసి దాని రీమేక్‌లో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదన తెలిపాడట. లోబడ్జెట్‌ చిత్రం కావడంతో నాగ్‌ స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో చేసినా ఈ చిత్రం ఇక్కడ కూడా ఘనవిజయం సాధించడం ఖరారైనట్లే కనిపిస్తోంది. గతంలో ఈ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్‌తో నాగ్‌ నటించి వుండటం, ఆ పరిచయాల వల్ల ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ప్రియదర్శన్‌ చేతనే డైరెక్షన్‌ చేయించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. కానీ ఈ రీమేక్‌కు ఉన్న ఒకే ఒక్క విలన్‌గా మోహన్‌లాల్‌ మారాడు. ఇప్పుడున్న తన క్రేజ్‌ దృష్ట్యా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయవద్దని, తెలుగులో డబ్బింగ్‌ చేయాలని మోహన్‌లాల్‌ భావన, మరి మోహన్‌లాల్‌, నాగార్జున పోటీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ చిత్రం తమిళ రీమేక్‌ కమల్‌హాసన్‌తో, హిందీ వెర్షన్‌ అక్షయ్‌కుమార్‌లతో ఫిక్స్‌ అయ్యాయి. మరి ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ విషయంపై ఆసక్తి నెలకొని ఉంది.

Similar News